: ఓట్లను తొలగించలేదు: భన్వర్ లాల్
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఓట్లను తొలగిస్తున్నారనే ఆరోపణలను రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్ లాల్ ఖండించారు. ఈ వార్తలన్నీ అవాస్తవమని చెప్పారు. తమ ఓట్లను తొలగించినట్టు ఎవరి వద్ద అయినా ఆధారాలు ఉంటే ఫిర్యాదు చేయవచ్చని చెప్పారు. అయితే, ఇప్పటిదాకా 5,14,796 మంది తమ ఓట్లను ఇతర ప్రాంతాలకు బదిలీ చేయించుకున్నారని ఆయన తెలిపారు. అంతేకాకుండా, గ్రేటర్ పరిధిలో 89,085 మంది డూప్లికేట్ ఓటర్లు ఉన్నారని చెప్పారు. కేవలం డూప్లికేట్ ఓట్లను మాత్రమే తొలగించామని భన్వర్ లాల్ స్పష్టం చేశారు. అర్హులైన వారందరికీ ఓటు హక్కు కల్పిస్తామని చెప్పారు.