: హైదరాబాదులో నకిలీ వీసాల ముఠా గుట్టు రట్టు


హైదరాబాదులో నకిలీ పాస్ పోర్టు, వీసాలు తయారు చేస్తున్న ఓ ముఠా గుట్టు రట్టయింది. ఈ ముఠాకు చెందిన ఇద్దరు వ్యక్తులను ఛాదర్ ఘాట్ లో పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా, వారి వద్ద నుంచి 19 నకిలీ పాస్ పోర్టులను స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం వారిని పోలీసులు విచారిస్తున్నారు. ఈ క్రమంలో, 29 మంది నుంచి రూ. 11.20 లక్షలను ఈ ముఠా తీసుకున్నట్టు విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు.

  • Loading...

More Telugu News