: పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో వెయ్యిమంది ఉగ్రవాదులకు పాక్ శిక్షణనిస్తోంది: లెఫ్ట్ నెంట్ జనరల్
భారత్ లో అక్రమంగా చొరబడేందుకు, భారీ దాడులు చేసేందుకు లష్కర్ ఏ తోయిబా ఉగ్రవాద సంస్థ ప్రయత్నాలు చేస్తోందని లెఫ్ట్ నెంట్ జనరల్ సతీష్ కుమార్ దువా శ్రీనగర్లో వెల్లడించారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో 17 ఉగ్రవాద శిబిరాల్లో 1150 మంది వరకు ఇందుకు సంబంధించి శిక్షణ పొందుతున్నట్టు నిఘా వర్గాల ద్వారా సమాచారం తెలిసిందని వెల్లడించారు. వీరికి పాకిస్థాన్ సైన్యం, ఐఎస్ఐ సహాయ సహకారాలు అందిస్తున్నాయని ఆయన తెలిపారు. 300 మందికి పైగా ఉగ్రవాదులు దేశ సరిహద్దు దాటి అక్రమంగా ప్రవేశించేందుకు ఇప్పటికే సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. లష్కర్ ఏ తోయిబా మరోసారి ముంబై తరహా దాడులకు తెగబడేందుకు ప్రయత్నిస్తోందన్న సమాచారం కూడా తమకు ఉన్నట్టు చెప్పారు.