: బాలీవుడ్ లో కామెడీ పండదు...వాపోతున్న అక్షయ్


బాలీవుడ్ లో కామెడీ పండదని స్టార్ హీరో అక్షయ్ కుమార్ వాపోతున్నాడు. బాలీవుడ్ లో 'ఖాన్ త్రయం' కంటే ఎక్కువ సక్సెస్ రేటు కలిగిన అక్షయ్ కుమార్ సూపర్ స్టార్ గా మాత్రం ఎదగలేదు. దీనిపై అక్షయ్ అప్పుడప్పుడు అసహనం వ్యక్తం చేస్తుంటాడు. ఆ మధ్య ఓ వేడుకలో డ్యాన్స్ చేసేందుకు తనను సంప్రదించిన ప్రతినిధులతో పారితోషికం మాట్లాడుతున్న సందర్భంగా 'షారూఖ్, సల్మాన్ లతో అయితే ఇలా బేరమాడుతారా?' అని ప్రశ్నించిన సంగతి చాలా మందికి గుర్తుండే వుంటుంది. అక్షయ్ తాజా సినిమా 'సింగ్ ఈజ్ బ్లింగ్' అక్టోబర్ 2న విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్ లో అక్షయ్ మాట్లాడుతూ, తనలోని కామెడీ యాంగిల్ ని ప్రేక్షకులు గుర్తించినా, భారీ, యాక్షన్ సినిమాలు చేయని కారణంగా అవార్డులు వరించవని అన్నాడు. కామెడీ హీరోలకు బాలీవుడ్ లో రావాల్సినంత గుర్తింపు లభించదని అక్కీ పేర్కొన్నాడు. కామెడీ ఆర్టిస్టులు కూడా ప్రతిభ నిరూపించుకుంటున్నారని అక్షయ్ అభినందించాడు. ఎవరికి నచ్చినా, నచ్చకున్నా తాను మాత్రం ఇదే పంథాలో సాగిపోతానని అక్షయ్ తెలిపాడు.

  • Loading...

More Telugu News