: సిరియా శరణార్థుల బాధ్యతలను పంచుకోవాల్సిందే: గ్రీస్
ఐఎస్ఐఎస్ అరాచకాలను తట్టుకోలేక, ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని సిరియా నుంచి తరలి వస్తున్న శరణార్థులను ఆదుకోవాల్సిన బాధ్యత ఐరోపా దేశాల మీద ఉందని గ్రీస్ ప్రధాని అలెక్సిన్ సిప్రస్ అన్నారు. ప్రధానిగా మళ్లీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన ప్రసంగిస్తూ, వలసదారుల బాధ్యతల్ని పంచుకోవాల్సిందే అని చెప్పారు. శరణార్థులను ఆదుకోలేకపోతే యూరోపియన్ దేశాలు అన్న పదానికే అర్థం లేకుండా పోతుందని అన్నారు.