: 'జిన్నా'లా ప్రవర్తిస్తున్న ఒవైసీ... దేశ విభజన కుట్రను కొనసాగనివ్వం: నజ్మా హెప్తుల్లా


భారతదేశం విడిపోయిన సమయంలో మహమ్మద్ అలీ జిన్నా పోషించిన పాత్రను ఇప్పుడు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ పోషిస్తున్నారంటూ కేంద్ర మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి నజ్మా హెప్తుల్లా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దేశాన్ని మరోసారి విభజించే కుట్రలు జరుగుతున్నాయని... వాటిని కొనసాగనివ్వమని ఆమె అన్నారు. ఢిల్లీలో జరిగిన ముస్లిం మైనారిటీ మేధావుల సమావేశంలో ఆమె కీలక ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా ఆమె ఒవైసీపై విమర్శలు గుప్పించారు. అంతేకాకుండా, బీహార్ ఎన్నికల్లో ఎంఐఎం ప్రభావంపై ఈ సమావేశంలో చర్చ జరిగినట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News