: రిపేర్ చేస్తుండగా పేలిన బస్సు ఇంజన్: డ్రైవర్, మెకానిక్ మృతి
బస్సు ఇంజన్ పేలడంతో డ్రైవర్, మెకానిక్ మృతి చెందిన సంఘటన తూర్పుగోదావరి జిల్లాలో చోటుచేసుకుంది. గోకవరం మండలం రామన్నపాలెం వద్ద తెలంగాణ ఫారెస్టు అకాడమీకి చెందిన ఈ బస్సును రిపేర్ చేస్తుండగా ఇంజన్ పేలింది. బస్సు డ్రైవర్ తో పాటు అక్కడే ఉన్న మెకానిక్ అబ్బులు కూడా మృతి చెందాడు. స్థానికుల నుంచి ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లారు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.