: సోమ్ నాథ్ భారతికి కోర్టులో చుక్కెదురు... బెయిల్ పిటిషన్ తిరస్కరణ


ఆప్ నేత సోమ్ నాథ్ భారతికి అరెస్ట్ గండం తప్పేలా లేదు. తన భార్య దాఖలు చేసిన గృహహింస కేసులో ముందస్తు బెయిల్ కోసం సోమ్ నాథ్ భారతి దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్ ను ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది. ఈ కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వలేమని కొద్దిసేపటి క్రితం కోర్టు తేల్చిచెప్పింది. దీంతో సోమ్ నాథ్ భారతి అరెస్ట్ తప్పేలా లేదు. పెంపుడు కుక్కతో కరిపించడమే కాక గర్భవతిగా ఉన్న తనపై సోమ్ నాథ్ భారతి దాడికి పాల్పడ్డాడని ఆయన సతీమణి లిపికా మిత్రా పోలీసులకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో కేసు నమోదైంది. ఈ కేసులో అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు సోమ్ నాథ్ భారతి ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. అయితే ఆయన పిటిషన్ ను కోర్టు తిరస్కరించిన నేపథ్యంలో నేడో, రేపో ఆయనను పోలీసులు అరెస్ట్ చేసే అవకాశాలున్నాయి.

  • Loading...

More Telugu News