: 'గే' అన్న పేరుతో 10 మందిని కాల్చి చంపిన ఐఎస్
ఐఎస్ఐఎస్ ఆగడాలకు, అరాచకాలకు అంతేలేకుండా పోతోంది. తాజాగా, స్వలింగ సంపర్కులు (గే) అన్న ఆరోపణలతో తొమ్మిది మంది పురుషులను, ఒక బాలుడిని ఐస్ ఉగ్రవాదులు కాల్చి చంపారు. రస్తాన్, హ్రైటన్ అనే పట్టణాల్లో ఈ దారుణం జరిగింది. ఈ వివరాలను సీరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్ అనే సంస్థ వెల్లడించింది. వీరందరినీ బహిరంగంగానే చంపేశారని... అయితే, వీటిని ఎవరూ చిత్రీకరించకుండా నియంత్రించారని తెలిపింది. స్వలింగ సంపర్కాన్ని ఐఎస్ఐఎస్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. గతంలో కూడా కొందరు 'గే'లను మేడ మీద నుంచి కిందకు తోసి చంపేసింది ఐఎస్.