: సింగపూర్ ప్రధానితో భేటీ అయిన చంద్రబాబు
సింగపూర్ పర్యటనలో ఉన్న ఏపీ ముఖ్యమంత్రి వరుస భేటీలతో బిజీబిజీగా గడుపుతున్నారు. తాజాగా, ఈ ఉదయం సింగపూర్ ప్రధానమంత్రి లీ సీన్ లూంగ్ తో చంద్రబాబు సమావేశమయ్యారు. ఏపీ రాజధాని అమరావతి శంకుస్థాపనకు హాజరుకావాలని ఈ సందర్భంగా సింగపూర్ ప్రధానిని ఆహ్వానించారు. అంతేకాకుండా, రాజధాని నిర్మాణం కోసం అద్భుతమైన ప్రణాళిక అందించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో అంతర్జాతీయ స్థాయి మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసే అంశంలో సహకరించాలని కోరారు. అలాగే, భారత్ లో నాలెడ్జ్ హబ్ గా ఏపీ అవతరించేందుకు సహకారం అందించాలని విన్నవించారు.