: గవర్నర్ తో భేటీ అయిన కేసీఆర్
తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ తో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ భేటీ అయ్యారు. రాజ్ భవన్ లో వీరి సమావేశం జరిగింది. ఈనెల 23వ తేదీ నుంచి టీఎస్ అసెంబ్లీ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో వీరి భేటీ జరిగింది. ఈ సందర్భంగా అసెంబ్లీ సమావేశాలు, తన చైనా పర్యటన విశేషాలతో పాటు, పలు అంశాలపై గవర్నర్ తో కేసీఆర్ చర్చించారు.