: ఎవరితోను ప్రేమలో లేను... సింగిల్ గానే ఉన్నా: బాలీవుడ్ నటి పూజా భట్


తాను ఎవరితోనూ ప్రేమలో పడలేదని... సింగిల్ గానే ఉన్నానని బాలీవుడ్ నటి పూజాభట్ స్పష్టం చేసింది. ప్రేమలో మునిగి తేలుతున్నానని తనపై వస్తున్న వార్తలన్నీ పుకార్లే అని కొట్టి పారేసింది. తన భర్త మనీష్ మఖీజతో పూజాభట్ వైవాహిక బంధం ఇటీవలే ముగిసింది. దీంతో, ఆమె మళ్లీ ప్రేమలో పడిందనే వార్తలు వెల్లువెత్తాయి. దీనిపై ట్విట్టర్లో స్పందించిన పూజాభట్... ఈ వయసులో (43) ప్రేమలో పడితే, ఆ విషయాన్ని తననే అడిగి తెలుసుకోవాలని... ఎవరో ఏదో చెబితే నమ్మేయడమేనా? అని ప్రశ్నించింది. ఈ పుకార్లపై స్పందించకూడదనే అనుకున్నానని... కానీ, మౌనంగా ఉంటే అదే నిజమని భావిస్తారనే ఉద్దేశంతోనే ఇప్పుడు స్పందిస్తున్నానని తెలిపింది.

  • Loading...

More Telugu News