: 'పే ఫర్ వాట్ యూ యూజ్'... ఎయిర్ టెల్ ప్రీపెయిడ్ వినియోగదారులకు కొత్త ప్లాన్


దేశంలోని ఎయిర్ టెల్ ప్రీపెయిడ్ వినియోగదారులకు సదరు సంస్థ కొత్త ప్లాన్ తీసుకొస్తోంది. మాట్లాడిన సమయం సెకన్లను బట్టే బిల్లు పడుతుందని ప్రకటించింది. అంటే 'వాడుకున్న దానికే బిల్లు' (పే ఫర్ వాట్ యూ యూజ్) నినాదంతో ఎయిర్ టెల్ ఈ కొత్త పద్ధతికి నాంది పలకనుంది. దాంతో ఎయిర్ టెల్ ప్రీపెయిడ్ ఖాతాదారులందరికీ ఎన్ని సెకన్లు మాట్లాడుకుంటే అన్ని సెకన్లకే బిల్లు పడుతుంది. ఈ రోజు నుంచే తమ ప్రీపెయిడ్ ఖాతాదారులందరినీ బిల్ ప్లాన్ లోకి మారుస్తున్నట్టు ఎయిర్ టెల్ తెలిపింది. ఇప్పటికే ఈ ప్లానులో చాలా మంది ఖాతాదారులు ఉండగా కొంత మంది మాత్రం నిమిషానికి ఒక కాల్ లెక్కన పడే బిల్లింగ్ ప్లాన్ లో ఉన్నారు. ఇప్పుడువారంతా కూడా ఈ కొత్త ప్లాన్ లో చేరిపోతారు.

  • Loading...

More Telugu News