: షీనా బోరా కేసులో నిందితుల కస్టడీ మరింత పొడిగింపు


సంచలనాత్మక షీనా బోరా హత్య కేసులో ముగ్గురు నిందితుల కస్టడీని కోర్టు మరింత పొడిగించింది. నేటితో వారి కస్టడీ ముగియడంతో పోలీసులు కోర్టు ముందు ప్రవేశపెట్టారు. దాంతో కేసులో ప్రధాన నిందితురాలు, షీనా తల్లి ఇంద్రాణి ముఖర్జియా, ఆమె మాజీ భర్త సంజీవ్ ఖన్నా, డ్రైవర్ శ్యాం రాయ్ లకు అక్టోబర్ 5 వరకు ముంబైలోని స్థానిక కోర్టు కస్టడీ విధించింది. ప్రస్తుతం ఈ కేసు విచారణను మహారాష్ట్ర ప్రభుత్వం సీబీఐకి బదిలీ చేసిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News