: రెహమాన్ ని హిందూ మతంలోకి ఆహ్వానించిన బీజేపీ ఎంపీ
ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ ను బీజేపీ ఎంపీ ఆదిత్యనాథ్ హిందూ మతంలోకి ఆహ్వానించారు. "రెహమాన్ హిందూ మతంలోకి వస్తానంటే సాదరంగా ఆహ్వానిస్తాం. ఆయనపై ఫత్వా జారీ చేయడం హాస్యాస్పదం" అని ఆదిత్యనాథ్ పేర్కొన్నారు. మహమ్మద్ ప్రవక్తపై తీసిన చిత్రానికి సంగీతం అందించినందుకుగానూ రెహమాన్ పై ముస్లిం మత పెద్దలు ఇటీవల ఫత్వా జారీ చేశారు. దానిని వీహెచ్ పీ కూడా ఖండించింది. హిందూమతంలోకి రావాలని వీహెచ్ పీ సంయుక్త ప్రధాన కార్యదర్శి సురేంద్ర జైన్ కూడా ఆయనను ఆహ్వానించారు. ఘర్ వాపసీకి కూడా ఇదే సరైన సమయమని పేర్కొన్నారు.