: నా వ్యక్తిగత స్నేహితుడిని కోల్పోయా: అరుణ్ జైట్లీ


బీసీసీఐ అధ్యక్షుడు దాల్మియా మృతిపై కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యక్తిగత స్నేహితుడిని కోల్పోయానని జైట్లీ తెలిపారు. బీసీసీఐను అత్యున్నత స్థాయికి చేర్చిన ఘనత దాల్మియాదే అని కొనియాడారు. భారత క్రికెట్ కు సంబంధించి తామిద్దరం ఎన్నో అంశాలపై చర్చించేవారమని తెలిపారు. ఈ ఉదయం నిద్రలేవగానే దాల్మియా మరణ వార్త తెలిసిందని... తాను ఒక్కసారిగా షాక్ కు గురయ్యానని చెప్పారు. గత నెలలో కోల్ కతాలో దాల్మియాను చివరిసారి కలిశానని తెలిపారు. దాల్మియా మన మధ్య లేకపోవడం తీరని లోటు అని చెప్పారు. ప్రస్తుతం జైట్లీ హాంకాంగ్ పర్యటనలో ఉన్నారు.

  • Loading...

More Telugu News