: విద్యుత్ పంపిణీ నష్టాలకు చెక్ తో ఏపీ ట్రాన్స్ కోకు రూ.1,950 కోట్ల ఆదా


విద్యుత్ సరఫరాలో ఏపీ సర్కారు మెరుగైన ఫలితాలు సాధిస్తోంది. రాష్ట్ర విభజన దరిమిలా దేశంలోనే 24 గంటల పాటు నిరంతర విద్యుత్ సరఫరా చేస్తున్న రాష్ట్రంగా ఏపీ రికార్డులకెక్కింది. విద్యుత్ సరఫరాలో పంపిణీ నష్టాలను నివారించడంలోనూ నారా చంద్రబాబునాయుడు సర్కారు మెరుగైన ఫలితాలనే సాధించింది. విద్యుత్ సరఫరాలో పంపిణీ నష్టాలను గణనీయంగా తగ్గించుకున్న ఏపీ ట్రాన్స్ కో ఏకంగా రూ.1,950 కోట్లను ఆదా చేసుకోగలిగింది. అంతేకాక విద్యుత్ సరఫరాకు సంబంధించి అత్యంత తక్కువ పంపిణీ నష్టాల(7 శాతం)తో దూసుకెళుతున్న రాష్ట్రంగానూ ఏపీ నిలిచిందని ఏపీ ట్రాన్స్ కో సీఎండీ విజయానంద్ చెప్పారు.

  • Loading...

More Telugu News