: ముస్లిం వ్యక్తి అమెరికా అధ్యక్షుడు కాలేడు: రిపబ్లికన్ నేత వివాదాస్పద వ్యాఖ్యలు


రిపబ్లికన్ పార్టీ నేత బెన్ కార్సన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఓ ముస్లిం వ్యక్తి ఎన్నటికీ అమెరికా అధ్యక్షుడు కాలేడని అన్నారు. అమెరికా రాజ్యాంగం ఇస్లాంకు అనుకూలం కాదని చెప్పారు. అమెరికాను పర్యవేక్షించే బాధ్యతను ముస్లిం వ్యక్తికి ఇవ్వాలనే సలహాను తాను ఇవ్వనని తెలిపారు. 'ఎన్ బీసీ' ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విధంగా స్పందించారు. రానున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరపున అభ్యర్థిత్వం కోసం కార్సన్ కూడా పోటీ పడుతున్నారు. తాజా ఒపీనియన్ పోల్స్ లో రెండో స్థానం నుంచి ఆయన మూడో స్థానానికి పడిపోయారు. అమెరికాకు కాబోయే అధ్యక్షుడు ఈ దేశ విధానాలు, విలువలను పాటించే వ్యక్తి అయి ఉండాలని కార్సన్ తెలిపారు.

  • Loading...

More Telugu News