: విశాఖలో ఐఐఎం తరగతులు ప్రారంభం... హాజరైన బెంగళూరు ఐఐఎం డైరెక్టర్
విశాఖపట్నంలో ప్రతిష్ఠాత్మక ఇండియన్ ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్ మెంట్ (ఐఐఎం-వి) తరగతులు ఇవాళ ప్రారంభమయ్యాయి. ఆంధ్రా విశ్వవిద్యాలయంలోని వైవీఎస్ మూర్తి ఆడిటోరియంలో జరిగిన ఈ ప్రారంభ కార్యక్రమానికి మంత్రి గంటా శ్రీనివాసరావు కూడా విచ్చేశారు. హామీ ఇచ్చిన మేరకు ఇండియన్ ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్ మెంట్ ను విశాఖలో ఏర్పాటు చేయడంపై కేంద్ర ప్రభుత్వానికి గంటా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు. తరగతుల ప్రారంభోత్సవ కార్యక్రమానికి బెంగళూరు ఐఐఎం డైరెక్టర్ సుశీల్ వచానీ కూడా హాజరయ్యారు.