: రేవంత్ రెడ్డి సోదరుడు గుండెపోటుతో మృతి
మహబూబ్ నగర్ జిల్లా కొడంగల్ నియోజకవర్గ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి సోదరుడు ఎనుముల కృష్ణారెడ్డి ఈరోజు గుండెపోటుతో మరణించారు. ఈ ఉదయం ఎప్పటిలానే స్నానం చేసి బయటకు వెళ్లిన ఆయన కొద్దిసేపటికి గుండెలో నొప్పి వస్తోందని ఇంటికి తిరిగొచ్చారని కుటుంబసభ్యులు తెలిపారు. వెంటనే కల్వకుర్తి ఆసుపత్రికి తీసుకువెళుతుండగా మార్గమధ్యంలో చనిపోయారని చెప్పారు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కృష్ణారెడ్డి స్వస్థలం మహబూబ్ నగర్ జిల్లా వంగూరు మండలం కొండారెడ్డిపల్లి. విషయం తెలుసుకున్న రేవంత్ వెంటనే బయలుదేరి వెళ్లారు. ఆయన అనుచరులు కూడా తరలివస్తున్నారు.