: మునిమడుగులో ప్రతీకార హత్య... కాంగ్రెస్ కార్యకర్తను నరికేసిన టీడీపీ వర్గం
కర్నూలు జిల్లా ప్యాపిలి మండలం మునిమడుగులో పోలీసు పహారా ఫ్యాక్షన్ హత్యలను ఆపలేకపోయింది. ఏపీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి, కేంద్ర మాజీ మంత్రి కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డి వర్గాల మధ్య తలెత్తిన ఘర్షణల్లో కాంగ్రెస్ కార్యకర్తలు నాసిర్ బాష అనే టీడీపీ కార్యకర్తను హత్య చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనతో ఒక్కసారిగా గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడకు చేరుకుని బందోబస్తు ఏర్పాటు చేశారు. అయినా టీడీపీ కార్యకర్తలు ప్రతీకార జ్వాలతో రగిలిపోయారు. పోలీసుల భద్రతా వలయాన్ని ఛేదించుకుని నాసిర్ బాష హత్యకు ప్రతీకారంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన కంబగిరి స్వామిని నరికేశారు. దీంతో ఈ ఘటనలో గంటల వ్యవధిలోనే ఆ గ్రామంలో ఇద్దరు వ్యక్తులు ఫ్యాక్షన్ రాజకీయాలకు బలైపోయారు.