: సింగపూర్ మంత్రి ఈశ్వరన్ తో సీఎం చంద్రబాబు భేటీ


సింగపూర్ పర్యటనలో ఉన్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ దేశ వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి ఈశ్వరన్ సహా ఆ శాఖ అధికారులతో భేటీ అయ్యారు. అంతకుముందు బాబు బృందానికి ఈశ్వరన్ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఈశ్వరన్ కు చంద్రబాబు శాలువా కప్పి జ్ఞాపిక, తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు. ఏపీ రాజధాని అమరావతి నగర అభివృద్ధి, స్విస్ ఛాలెంజ్ పద్ధతిపై ఈ సమావేశంలో సీఎం చర్చిస్తున్నారు. తరువాత ఈశ్వరన్ ఇచ్చే విందు భేటీలో కూడా చంద్రబాబు బృందం పాల్గొంటుంది. ఈ సాయంత్రం సౌత్ ఆసియన్ స్టడీస్ ఇన్ స్టిట్యూట్ లో చంద్రబాబు కీలకోపన్యాసం చేస్తారు.

  • Loading...

More Telugu News