: ‘తమ్మిలేరు’ గండిపై విమర్శల వెల్లువ... విచారణకు ఆదేశించిన ఏపీ సర్కారు
పోలవరం ప్రాజెక్టు కుడికాలువకు తమ్మిలేరు వద్ద పడిన గండిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇంజినీరింగ్ లోపం కారణంగానే కాలువకు గండి పడిందని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు నిన్న ఆరోపించిన సంగతి తెలిసిందే. వీర్రాజు ఆరోపణలతో పాటు కాంగ్రెస్ పార్టీ కూడా ఈ అంశంపై మాటల దాడి మొదలుపెట్టింది. పనుల్లో నాణ్యతా ప్రమాణాలు లోపించడం, నాసిరకం పనుల కారణంగానే కాలువకు గండి పడిందని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. మిత్రపక్షం బీజేపీతో పాటు విపక్షం కాంగ్రెస్ చేసిన ఆరోపణల నేపథ్యంలో ఈ అంశపై ఏపీ సర్కారు విచారణకు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఏపీ జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఈ ఘటనపై అధికారులతో సమీక్షించడమే కాక సమగ్ర దర్యాప్తు చేసి, గండి పడటానికి గల కారణాలను వెలికితీయాలని ఆదేశాలు జారీ చేశారు.