: ఢిల్లీని జల్లెడ పట్టిన కడప పోలీసులు... ‘ఎర్ర’ స్మగ్లర్ కు సంకెళ్లేసిన ఏపీ పోలీస్
నిన్నటిదాకా చిత్తూరు జిల్లా పోలీసులు జిల్లా, రాష్ట్ర సరిహద్దులు దాటి ఎర్రచందనం స్మగ్లర్ల భరతం పడితే, తాజాగా ఆ బాధ్యతను కడప జిల్లా పోలీసులు తీసుకున్నారు. ఇటీవల అరెస్టైన ఎర్రచందనం స్మగ్లర్ల నుంచి కీలక సమాచారాన్ని రాబట్టిన కడప పోలీసులు నిన్న హుటాహుటిన ఢిల్లీకి వెళ్లారు. ఢిల్లీ వీధులను జల్లెడ పట్టిన కడప జిల్లా పోలీసులు ఎర్రచందనం అక్రమ రవాణాలో అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన స్మగ్లర్ హుసేన్ కు సంకెళ్లేశారు. ఈ సందర్భంగా హుసేన్ ఢిల్లీలో దాచిపెట్టిన 8 టన్నుల ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.