: థ్యాంక్స్ సర్! తెలుగు సినీ పరిశ్రమకు మరో స్టార్ నిచ్చారు: నాగార్జునతో మహేశ్ బాబు


'మనం' సినిమా చూసిన వెంటనే నాగార్జునకి ఫోన్ చేశానని మహేష్ బాబు చెప్పాడు. 'అఖిల్' ఆడియో వేడుకలో మహేశ్ బాబు మాట్లాడుతూ, ''సార్... 'మనం' సినిమా అద్భుతంగా ఉంది. కానీ లాస్ట్ మినిట్ లో అఖిల్ ఇంట్రడక్షన్ తో స్క్రీన్ వెలిగిపోయింది సర్' అని చెప్పాను. దానికి నాగార్జనగారు సమాధానమిస్తూ 'సినిమాకు తామంతా కష్టపడితే లాస్ట్ మినిట్ లో వచ్చి క్రెడిటంతా వాడు కొట్టేశాడ'ని అన్నారు. అఖిల్ స్క్రీన్ ప్రెజెన్స్ అద్భుతం" అని మహేశ్ బాబు చెప్పాడు. ఈ సందర్భంగా నాగార్జున వైపు తిరిగి, "ధాంక్స్ సర్, తెలుగు సినీ పరిశ్రమకు మరో స్టార్ నిచ్చారు" అన్నాడు మహేశ్. 'ఏఎన్ఆర్ లివ్స్ అన్' అనే మాటకి నిదర్శనం అఖిలేనని మహేశ్ బాబు అభిప్రాయపడ్డాడు.

  • Loading...

More Telugu News