: రెండు రోజులప్పుడు వాడిని ఒళ్లో పెట్టుకున్నా...ఆనందంగా ఉంది: 'అఖిల్' ఆడియో వేడుకలో హీరో సుమంత్
సెప్టెంబర్ 20 అంటే తాతగారి పుట్టిన రోజు. ఈ రోజు ఆయన ఉంటే ఎంతో బాగుండేదని అంతా బావిస్తున్నారని హీరో సుమంత్ చెప్పాడు. తాతగారి ఆశీస్సులు అఖిల్ పై ఎప్పుడూ ఉంటాయని సుమంత్ అన్నాడు. 1994లో తాను అమెరికాలో చదువుకుంటున్నప్పుడు అఖిల్ పుట్టాడని సుమంత్ చెప్పాడు. వాడు పుట్టిన రెండు రోజులకు వాడిని ఈ చేతులతో ఎత్తుకుని, ఒళ్లో కూర్చోబెట్టుకున్నానని గుర్తు చేసుకున్నాడు. వాడిప్పుడు ఇంత పెద్దోడైపోయాడంటే...ఆ ఫీలింగే అద్భుతంగా వుందని సుమంత్ చెప్పాడు. 'వాడు పుట్టుకతోనే సూపర్ స్టార్' అని సుమంత్ అభిప్రాయపడ్డాడు. ఈ సందర్భంగా 'అఖిల్' సినిమాలోని తొలి పాటను సుమంత్ ఆవిష్కరించాడు.