: సీనియర్ల తరఫున ప్రతీకారం తీర్చుకున్న జూనియర్లు


బంగ్లా పర్యటనలో టీమిండియా జట్టుకు ఎదురైన పరాభవానికి భారత 'ఏ' జట్టు ప్రతీకారం తీర్చుకుంది. బంగ్లాదేశ్ ఏ జట్టుతో జరుగుతున్న సిరీస్ ను భారత ఏ జట్టు గెలుచుకుంది. మూడు వన్డేల సిరీస్ ను 2-1తో భారత ఏ జట్టు గెలుచుకుంది. బెంగళూరులో జరిగిన మూడో వన్డేలో టాస్ గెలిచిన భారత ఏ జట్టు బ్యాటింగ్ ప్రారంభించింది. మయాంఖ్ అగర్వాల్ (4) విఫలం కాగా, ఉన్ముక్త్ చాంద్ (41) రాణించాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన సంజు శాంసన్ (90), సీనియర్ సురేష్ రైనా (104) విజృంభించడంతో భారత ఏ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 297 పరుగులు చేసింది. అనంతరం వర్షం వల్ల ఆటకు అంతరాయం కలిగింది. దీంతో 32 ఓవర్లలో 217 పరుగులుగా అంపైర్లు విజయ లక్ష్యం నిర్ణయించారు. దీంతో, బ్యాటింగ్ ప్రారంభించిన బంగ్లాదేశ్ ఏ జట్టు ఆదిలోనే సౌమ్య సర్కార్ (1), రోనీ తలుద్కర్ (9), అనముల్ హక్ (1)ల వికెట్లు కోల్పోయింది. అనంతరం సబ్బీర్ రెహ్మాన్ (41), మునిమల్ హక్ (37), నాసిర్ హుస్సేన్ (22) పరుగులు సాధించారు. దీంతో నిర్ణీత 32 ఓవర్లలో బంగ్లాదేశ్ ఏ జట్టు ఆరు వికెట్లు కోల్పోయి 141 పరుగులే చేసింది. దీంతో డక్ వర్త్ లూయీస్ పద్ధతిలో భారత ఏ జట్టు 75 పరుగుల తేడాతో విజయం సాధిచి, సిరీస్ గెలుచుకుంది.

  • Loading...

More Telugu News