: బయ్యారంలోనే స్టీల్ ప్లాంట్ నెలకొల్పాలి: చంద్రబాబు డిమాండ్
ఖమ్మం జిల్లా బయ్యారం వద్దే స్టీల్ ప్లాంట్ నెలకొల్పాలని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు. బాబు ప్రస్తుతం విశాఖ జిల్లాలో పాదయాత్ర చేస్తున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఎన్డీఏ హయాంలో విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను తాము అడ్డుకున్నామని బాబు తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కు ఓబుళాపురం గనులను కేటాయించాలని తాము కోరితే వైఎస్ రాజశేఖరరెడ్డి నిరాకరించాడని వెల్లడించారు.