: మా మధ్య ఎలాంటి రహస్య ఒప్పందం లేదు: అసదుద్దీన్ ఒవైసీ


బీజేపీతో తమ పార్టీకి ఎటువంటి రహస్య ఒప్పందం లేదని ఏఐఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. త్వరలో జరగనున్న బీహార్ ఎన్నికల్లో తమకు, బీజేపీకి మధ్య రహస్య ఒప్పందం కుదిరిందన్న వార్తలను ఆయన కొట్టిపారేశారు. బీహార్ లో జనతాపరివార్ కూటమి ద్వారా రాష్ట్రానికి ఎలాంటి అభివృద్ధి జరగదన్నారు. ఆ పార్టీల గత పాలన చూస్తే అన్నీ అర్థమవుతాయన్నారు. మతపరమైన రాజకీయ పార్టీలను కాకుండా లౌకిక నాయకత్వాన్ని గెలిపించాలని బీహార్ ప్రజలను కోరుకుంటున్నానని చెప్పారు. ఎన్నికల్లో తమ పార్టీ సీమాంచల్ ప్రాంతానికే పరిమితమవుతుందని, ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తామనే విషయమై త్వరలోనే ఒక నిర్ణయం తీసుకుంటామని అసదుద్దీన్ చెప్పారు.

  • Loading...

More Telugu News