: రంగునీళ్లలో యాసిడ్ కలిపి చల్లిన ఆకతాయిలు
వినాయక నిమజ్జనం సందర్భంగా జరుగుతున్న ఊరేగింపులో ఆకతాయిల ఆగడాలు మితిమీరడంతో ఇద్దరి పరిస్థితి విషమించింది. 25 మంది తీవ్ర గాయాలపాలయ్యారు. ఈ సంఘటన చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండలంలోని వడ్డేపల్లిలో చోటుచేసుకుంది. రంగునీళ్లలో యాసిడ్ కలిపిన ఆకతాయిలు ఆ నీళ్లను అక్కడున్న వారిపై చల్లారు. దీంతో గందరగోళం నెలకొంది. బాధితులను ఆసుపత్రికి తరలించారు. ఆకతాయిల చేష్టలపై గ్రామస్థులు, బాధితులు, వారి కుటుంబీకులు మండిపడుతున్నారు. భక్తితో నిర్వహించే కార్యక్రమాల్లో ఇటువంటి పాడు పనులేమిటంటూ వారిని దుయ్యబడుతున్నారు.