: ఆంధ్రా పాలకులు కట్టింది ప్రాజెక్టులు కాదు, బొమ్మలు: మంత్రి హరీష్ రావు


గత ఆంధ్రా పాలకుల హయాంలో నిర్మించినవి ప్రాజెక్టులు కాదని, అవి ఒట్టి బొమ్మలని తెలంగాణ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు విమర్శించారు. నిజామాబాద్ జిల్లా బీర్కూర్ మండలంలోని సించొల్లి గ్రామంలో రూ.4.20 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ఎత్తిపోతల పథకానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా గ్రామంలో ఏర్పాటు చేసిన సభలో హరీష్ రావు మాట్లాడుతూ, ప్రస్తుతం జరుగుతున్న రైతు ఆత్మహత్యలకు నాటి ఆంధ్రా పాలకుల నిర్లక్ష్యమే కారణమన్నారు. కేవలం కాంట్రాక్టర్లు, కమిషన్ల కోసమే వారు ప్రాజెక్టులు కట్టించారని ఆరోపించారు. నిజాంసాగర్ లో నీరు లేకపోవడంతో పంటలన్నీ ఎండిపోతున్నాయన్నారు. ఈ సమస్య నుంచి బయటపడేందుకు గోదావరి నీటిని సింగూరు ప్రాజెక్టుకు తరలించి, అక్కడి నుంచి నిజాంసాగర్ లోకి నీటిని విడుదల చేసేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు.

  • Loading...

More Telugu News