: రామాయణం, భారతం చెబితే వినడం లేదా?...ఇదీ అంతే!: కమలహాసన్
రామాయణం, భారతం ఎన్నిసార్లు చెప్పినా వినడం లేదా? సినిమాలు అంతేనని కమలహాసన్ అన్నారు. సినిమాను వినూత్నంగా చూడాలని ప్రేక్షకులు భావిస్తారని ఆయన చెప్పారు. అయితే చెప్పే ప్రతిదీ ఆసక్తికరంగా ఉండాలని ఆయన సూచించారు. విభిన్నం పేరిట ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తే దానిని ప్రేక్షకులు హర్షించరని అన్నారు. ప్రేక్షకులు ఒకసారి వేసుకున్న దుస్తులు మరోసారి వేసుకోరా? వేసుకుంటారు కదా... కథలు కూడా అంతే...ఒకే కథని పదిసార్లు చెప్పినా, ప్రతిసారీ కొత్త అనుభూతి కలిగేలా చెబితే విజయం సాధిస్తుందని ఆయన వివరించారు.