: రైతుల పోరాటానికి మోదీ ప్రభుత్వం తలొగ్గింది: సోనియా గాంధీ
రైతులకు నష్టం చేసే అభివృద్ధికి తాము వ్యతిరేకమని ఏఐసీసీ చీఫ్ సోనియా గాంధీ తెలిపారు. న్యూఢిల్లీలో కిసాన్ సమ్మాన్ ర్యాలీ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, భూసేకరణ ఆర్డినెన్స్ కు వ్యతిరేకంగా రైతులు చేసిన పోరాటానికి ప్రధాని మోదీ ప్రభుత్వం తలొగ్గిందని అన్నారు. విదేశీ పర్యటనలకు, కార్పొరేట్ శక్తులను కలిసేందుకు సమయం కేటాయించే ప్రధాని, రైతులను కలిసేందుకు మాత్రం సమయం లేదంటున్నారని ఆమె ఆరోపించారు. పోరాటం ఇంకా ముగియలేదని, ప్రజా వ్యతిరేక విధానాలపై మరింత పోరాటం చేస్తామని, ఇందుకు ప్రతి కార్యకర్త సంసిద్ధులై ఉండాలని ఆమె సూచించారు.