: గిరిజన గ్రామాలకు నిలిచిపోయిన రాకపోకలు!
ఖమ్మం జిల్లా చర్ల మండలంలో ఉన్న తాలిపేరు ప్రాజెక్టులో నీటిమట్టం గరిష్ట స్థాయికి చేరింది. దీంతో 16 గేట్లు ఎత్తివేశారు. 19 వేల క్యూసెక్కుల నీరు విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు. అంతేకాకుండా, వాజేడు మండలంలోని చీకుపల్లి కల్వర్టు పై నుంచి వాగు పొంగిపొర్లుతోంది. దీంతో 20 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. రవాణా సౌకర్యం లేకపోవడంతో గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇదిలా ఉండగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్టణం జిల్లాలోని పాడేరు మండలంలో మట్టిగడ్డ వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. గొడలి దగ్గర వాగులో పడి ఒక గిరిజనుడు మృతి చెందాడు.