: ఆదిలోనే హంసపాదు... శ్రీదత్త కళాశాలలో ప్రారంభం కాని ఏఈఈ పరీక్ష


తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన ఏఈఈ ఆన్ లైన్ పరీక్షకు ఆదిలోనే హంసపాదు ఎదురైంది. హైదరాబాదు, వరంగల్, కరీంనగర్, ఖమ్మం జిల్లాల్లో ఏర్పాటు చేసిన 99 పరీక్షా కేంద్రాల్లో నేటి ఉదయం పరీక్ష ప్రారంభమైంది. అయితే హైదరాబాదు పరిధిలోని శ్రీదత్త ఇంజినీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రంలో మాత్రం పరీక్ష ప్రారంభం కాలేదు. సాంకేతిక లోపం తలెత్తిన కారణంగా గంటన్నర గడిచినా ఇంకా పరీక్ష ప్రారంభం కాలేదని అక్కడి అధికారులు చెబుతున్నారు. ఆన్ లైన్ పద్ధతిన జరుగుతున్న ఈ పరీక్ష నిర్దేశిత సమయానికి ప్రారంభం కాకపోవడంతో కళాశాలలో పరీక్ష రాసేందుకు వచ్చిన ఉద్యోగార్థులు ఆందోళన చెందుతున్నారు.

  • Loading...

More Telugu News