: రైతులకు భరోసా కల్పిస్తాం... ప్రభుత్వానికి సలహాలిస్తాం: తెలంగాణ జాగృతి చీఫ్ కల్వకుంట్ల కవిత
తెలంగాణలో అన్నదాతల ఆత్మహత్యలకు అడ్డుకట్ట వేసేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, నిజామాబాదు ఎంపీ కల్వకుంట్ల కవిత అన్నారు. రైతులకు భరోసా ఇచ్చేందుకు జాగృతి తరఫున ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఆమె కొద్దిసేపటి క్రితం నిర్వహించిన మీడియా సమావేశంలో పేర్కొన్నారు. అప్పుల్లో కూరుకుపోతున్న అన్నదాతలను ఆదుకునేందుకు వివిధ పారిశ్రామిక సంస్థలు, ప్రముఖులు ముందుకు వస్తున్నారని ఆమె అన్నారు. రైతు ఆత్మహత్యలను నిలువరించేందుకు తీసుకోవాల్సిన చర్యలకు సంబంధింది ప్రభుత్వానికి జాగృతి సలహాలు, సూచనలు చేస్తుందని ఆమె ప్రకటించారు. రైతుల ఆత్మహత్యలపై మీడియా సంస్థలు సంయమనంతో కూడిన విధంగా కథనాలు రాయాలని ఆమె కోరారు.