: వాయుమార్గంలో రాహుల్ కు ట్రాఫిక్ చిక్కులు!
కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి వాయు మార్గంలోనూ ట్రాఫిక్ చిక్కులు ఎదురయ్యాయి. దీంతో ఢిల్లీలో దిగాల్సిన ఆయన విమానం రాజస్థాన్ లోని జయపుర విమానాశ్రయానికి తరలివెళ్లాల్సి వచ్చింది. బీహార్ ఎన్నికల్లో భాగంగా నిన్న పార్టీ అభ్యర్థుల తరఫున పాట్నాలో జరిగిన ప్రచారంలో పాలుపంచుకున్న ఆయన ఆ తర్వాత ఢిల్లీకి బయలుదేరారు. రాహుల్ విమానం ఢిల్లీ సమీపంలోకి వచ్చేసరికి అక్కడి వాయు మార్గాలన్ని రద్దీగా ఉన్నాయి. దీంతో దాదాపు అరగంట పాటు రాహుల్ విమానం గాల్లోనే చక్కర్లు కొట్టింది. అయినా ఫలితం లేకపోవడంతో సమీపంలోని జయపుర సంగనేర్ ఎయిర్ పోర్టులో ల్యాండైంది. అక్కడి నుంచి మరో విమానంలో రాహుల్ గాంధీ ఢిల్లీ చేరుకున్నారు.