: వెంకయ్య నోట మారుమారు ‘కబడ్డీ’ మాట!


భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ముప్పవరపు వెంకయ్యనాయుడు విద్యార్థి దశలో మంచి కబడ్డీ ప్లేయరట. ఈ విషయాన్ని వేరెవరో చెప్పలేదు. ఆయనే స్వయంగా తన కబడ్డీ ప్రావీణ్యాన్ని వెల్లడించారు. ఇటీవల ప్రొ కబడ్డీ లీగ్ సందర్భంగా హైదరాబాదులో కబడ్డీ గురించి మాట్లాడిన వెంకయ్య తాజాగా నిన్న మరోమారు ఆ క్రీడను ప్రస్తావించారు. హైదరాబాదులోని శారదామందిరం సరస్వతి శిశుమందిర్ లో ‘దక్షిణ భారత విద్యాభారతి స్పోర్ట్స్ మీట్’ను నిన్న ప్రారంభించిన సందర్భంగా ఆయన కబడ్డీ ప్రస్తావన తీసుకొచ్చారు. కబడ్డీ క్రీడ తన జీవన గమనాన్నే మార్చేసిందని వెంకయ్య తెలిపారు. క్రీడలు ఆత్మ స్థైర్యాన్ని పెంపొందించడమే కాక శారీరక, మానసిక ఉల్లాసాన్ని ఇస్తాయని ఆయన పేర్కొన్నారు. విద్యార్థి దశలో తాను ఖోఖో, కబడ్డీ ఆడేవాడినని పేర్కొన్న ఆయన, కబడ్డీ అంటే ప్రాణమిచ్చే వాడినని చెప్పారు. ఆ క్రీడ తన జీవన గమనాన్నే మార్చేసిందని వెంకయ్య వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News