: గర్ల్ ఫ్రెండ్ తో కలిసి నైరోబీకి రోహిత్... వన్యప్రాణుల సంరక్షణపై ప్రచారం
టీమిండియా స్టైలిష్ బ్యాట్స్ మన్ రోహిత్ శర్మ తన గర్ల్ ఫ్రెండ్ రితికాతో కలిసి ప్రస్తుతం నైరోబీలో పర్యటిస్తున్నాడు. అక్కడి అటవీ ప్రాంతాల్లో చక్కర్లు కొడుతున్న రోహిత్... వైట్ రైనోస్, అటవీ జంతువులను వేటాడే స్నిఫర్ డాగ్స్ చూసి సంబరపడిపోతున్నాడు. వీటిని చూడటం తన అదృష్టంగా భావిస్తున్నట్లు కూడా అతడు పేర్కొన్నాడు. అసలు విషయమేంటంటే... పెటా సభ్యుడిగా ఉన్న రోహిత్ వన్యప్రాణుల సంరక్షణలో భాగంగా హాలీవుడ్ ప్రముఖ నటులు మాట్ లీ బ్లాంక్, స్లామ్ హయక్ లతో చేతులు కలిపాడు. ఆఫ్రికాలో అరుదైన వన్యప్రాణుల అక్రమ రవాణాను నిరోధించేందుకు ఉద్దేశించిన ప్రచార కార్యక్రమంలో రోహిత్ పాల్గొన్నాడు. ఇందుకోసమే అతడు తన గర్ల్ ఫ్రెండ్ తో కలిసి అక్కడికి వెళ్లాడట.