: 'స్టయిలిష్ స్టార్'తో డ్యాన్స్ చేయాలనుందంటున్న అలనాటి డ్యాన్సర్ జ్యోతిలక్ష్మి!


ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణల హయాంలో తన డ్యాన్సులతో ప్రేక్షకుల మతి పోగొట్టిన శృంగార తార జ్యోతిలక్ష్మి. నటదిగ్గజాలతో డ్యాన్స్ చేసిన జ్యోతిలక్ష్మికి ఒక కోరిక మిగిలి ఉంది. అదేమిటంటే, స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ తో కలసి డ్యాన్స్ చేయాలనేది. ఓ టీవీ చానల్ ఇంటర్వ్యూలో ఆమె తన అంతరంగాన్ని తెలియజేశారు. ఇప్పుడున్న కుర్ర హీరోల్లో అల్లు అర్జున్ మంచి డ్యాన్సర్ అని ఆమె కితాబిచ్చారు. వ్యక్తిగతంగా తాను అల్లు అర్జున్ కి అభిమాని అని చెప్పారు. తాను తమిళియన్ అయినప్పటికీ... చెన్నైలో అందరూ తనను తెలుగు మహిళగానే భావిస్తుంటారని చెప్పారు. ఐటెం సాంగులను హీరోయిన్స్ చేయడం చాలా తప్పని ఆమె అభిప్రాయపడ్డారు. హీరోయిన్లే ఐటెం సాంగులు చేస్తే... డ్యాన్సర్ల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News