: సముద్రంలో ముగ్గురు ఇంజనీరింగ్ విద్యార్థుల గల్లంతు
సముద్ర స్నానానికని వెళ్లిన ముగ్గురు ఇంజనీరింగ్ విద్యార్థులు గల్లంతైన విషాద సంఘటన శ్రీకాకుళం జిల్లాలో జరిగింది. సంతబొమ్మాళి మండలం కొత్తవూరు తీరంలో సముద్రస్నానం చేసేందుకని ఏఐటీఎం కాలేజీలో చదువుకుంటున్న విద్యార్థులు సునీల్ పటేల్, రాజ్ కుమార్, వివేక్ గుప్తా వెళ్లారు. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని అధికారులు తెలిపారు. ఈ వార్తతో విద్యార్థుల బంధువులు, మిత్రులు విషాదంలో మునిగిపోయారు.