: వలసదారుల కోసం విరాళాలు సేకరిస్తున్న 'యాపిల్'
ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల అరాచకాలతో సిరియా వంటి పలు దేశాల ప్రజలు శరణార్థులుగా మారి ఇతర దేశాలకు వలసపోతున్నారు. నిలువనీడ లేకుండా పలుచోట్ల తలదాచుకుంటున్నారు. ఇలాంటి వారికి తమదైన సాయం చేయాలని ప్రముఖ ఎలక్ట్రానిక్స్ దిగ్గజ సంస్థ యాపిల్ నిర్ణయించుకుంది. వలసదారుల కోసం విరాళాలు ఇచ్చేందుకు నిధులు సమకూర్చాలనుకున్నట్టు యాపిల్ అధికారిక ప్రతినిధి ఒకరు తెలిపారు. ఇందుకోసం ఆ సంస్థ సీఈవో టిమ్ కుక్ తమ ఉద్యోగులందరికి ఓ సందేశాన్ని పంపించారు. వలసదారులకు అండగా ఉండేందుకు అందరూ విరాళాలు ఇవ్వాలని తెలిపారు. అలాగే యాపిల్ యాప్ స్టోర్, ఐట్యూన్స్ నుంచి కూడా 'డొనేట్' బటన్ ని ఏర్పాటు చేసి వినియోగదారుల నుంచి కూడా విరాళాలను ఆహ్వానిస్తున్నారు. ఆ వచ్చిన విరాళాల్ని 'రెడ్ క్రాస్' ద్వారా వలసదారుల సంక్షేమం కోసం ఖర్చుపెడతారు.