: రాహుల్ సభలో ఎయిర్ గన్
బీహార్ శాసనసభ ఎన్నికల నేపథ్యంలో, ఆ రాష్ట్రంలో ప్రచారానికి వెళ్లిన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ నేడు చంపారన్ లో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా రాహుల్ సభలో కలకలం రేగింది. తయ్యబ్ జాన్ అనే యువకుడు ఎయిర్ గన్ పట్టుకుని తిరుగుతుంటే పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. దీనిపై జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, నిందితుడి మానసిక స్థితి సరిగా లేదని... ఎవరికీ అపకారం తలపెట్టడానికి అతను గన్ తెచ్చుకోలేదని... కేవలం ఆత్మరక్షణకే తెచ్చుకున్నాడని తెలిపారు. తయ్యబ్ నుంచి ఓ బట్టల బ్యాగును కూడా స్వాధీనపరుచుకున్నామని చెప్పారు. నిందితుడు చంపారన్ జిల్లాకే చెందిన వాడని తెలిపారు. జరిగిన ఘటనపై దర్యాప్తు జరుపుతున్నామని వెల్లడించారు.