: స్పెయిన్ దంపతుల కథ చెప్పిన దర్శకుడు పూరి


ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ గోవా వెళ్లినప్పుడు అక్కడ తనకు ఎదురైన ఒక అనుభవాన్ని తాజాగా ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ ఇలా సాగింది... గోవాలో స్పెయిన్ దేశానికి చెందిన దంపతులు మార్తా, బోరిస్ లు తారసపడ్డారు. వాళ్లు తమ దేశం నుంచి బయలు దేరినప్పుడు ఎక్కడా టికెట్ కొనలేదు. అట్లా 20 దేశాలు దాటుకుంటూ వచ్చారు. ప్రతిచోటా ఎవరినో ఒకరిని లిఫ్ట్ అడగటం..పని చక్కబెట్టుకోవడం చేశారు. సరిహద్దుల వద్దా ఎటువంటి సమస్యా లేకుండా దాటారు. ఆ క్రమంలో మన దేశంలోని గోవాకు వచ్చారు. గోవాలో ఒక పిల్లిపిల్ల వాళ్లకు యమ నచ్చేసింది. దీంతో దాన్ని పెంచుకున్నారు. ‘బర్మా’ అని దానికి పేరు పెట్టారు. ‘బర్మా’ను స్పెయిన్ కు తీసుకువెళ్తామని చెప్పారని పూరీ పేర్కొన్నాడు. ఈ స్పెయిన్ దంపతులను తన లోఫర్ చిత్రంలో చూడొచ్చంటూ ట్వీట్ ముగించాడు పూరి.

  • Loading...

More Telugu News