: కేఈ కృష్ణమూర్తి శాఖ మారనుందా?
ఏపీ డిప్యూటీ సీఎం, రెవెన్యూ శాఖ మంత్రి కేఈ కృష్ణమూర్తిని ఆ శాఖ నుంచి తప్పించవచ్చనే వార్తలు వెలువడుతున్నాయి. రెవెన్యూ శాఖలో అవినీతి భారీగా ఉందని సాక్షాత్తు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలే దీనికి నిదర్శనమని అంటున్నారు. డైరెక్ట్ గా కేఈని తప్పుబట్టలేకే... ఆయన శాఖపై చంద్రబాబు విమర్శలు గుప్పించారని చెబుతున్నారు. మరోవైపు, అనారోగ్య కారణాల రీత్యా సచివాలయానికి కేఈ రెగ్యులర్ గా రాకపోవడం కూడా ఓ కారణమని అంటున్నారు. దీనికి తోడు, కర్నూలు జిల్లాలో కేఈ కుటుంబ సభ్యులపై ఫిర్యాదులు కూడా వస్తున్నాయట. ఈ క్రమంలో, కేఈని పూర్తిగా మంత్రి పదవి నుంచి తొలగించకుండా... శాఖను మాత్రం మార్చుతారని వార్తలు వస్తున్నాయి.