: జార్ఖండ్ లో 'ఎంఎస్ జి2- ద మెసెంజర్' చిత్రంపై నిషేధం


'ఎంఎస్ జి 2- ద మెసెంజర్' చిత్రంపై జార్ఖండ్ రాష్ట్రంలో నిషేధం విధించారు. గిరిజన ప్రజల సెంటిమెట్లను గౌరవిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది. తాజాగా విడుదలైన ఈ సినిమాలో కొన్ని వ్యాఖ్యలు రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయని ఆ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. ఈ క్రమంలో ఆ వ్యాఖ్యలు గిరిజనుల మనోభావాలను కించపరుస్తున్నాయని, అందుకే సినిమా గురించి సమాచారాన్ని సేకరించిన సీఎం రఘువర్ దాస్ నిషేధించాలని అధికారులకు సూచించినట్టు అధికారిక ప్రకటనలో పేర్కొన్నారు. జార్ఖండ్ జనాభాలో 27 శాతం మంది గిరిజనులే ఉన్నారు. మరో విషయమేమిటంటే ఆ రాష్ట్రానికి తొలి గిరిజనేతర సీఎం కూడా రఘువర్ దాసే.

  • Loading...

More Telugu News