: ప్రత్యేక హోదా కోసం ఏపీ కాంగ్రెస్ 'ఎస్ఎంఎస్ ల ఉద్యమం'


ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కోసం ఏపీ కాంగ్రెస్ కొత్త ఉద్యమం చేపట్టింది. అదే 'కోటి ఎస్ఎంఎస్ ల ఉద్యమం'. ఈ ఉద్యమాన్ని ఈ నెల 23 నుంచి విశాఖపట్నంలో ప్రారంభిస్తామని పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి తెలిపారు. హైదరాబాదులోని పార్టీ కార్యాలయం ఇందిరాభవన్ లో రాష్ట్రంలోని 13 జిల్లాల యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్ యూఐ నేతలతో రఘువీరా సమావేశమయ్యారు. ప్రత్యేక హోదా కోసం ఎస్ఎంఎస్ ఉద్యమం చేపట్టాలని నిర్ణయించారు. ఈ ఉద్యమంపై జిల్లా నేతల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రానికి వెంటనే హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ... ప్రధానితో పాటు కేంద్ర మంత్రులకు ఎస్ఎంఎస్ లు ఇస్తామని రఘువీరా చెప్పారు.

  • Loading...

More Telugu News