: జీతాలు ఇవ్వడం లేదంటూ 'కేశవరెడ్డి పాఠశాల' ఉపాధ్యాయుల ఆందోళన
ఓ వైపు అక్రమ డిపాజిట్ల కేసులో కేశవరెడ్డి అరెస్టవగా, ఇప్పుడు తమకు జీతాలు ఇవ్వడం లేదంటూ అనంతపురం కేశవరెడ్డి పాఠశాల ఉపాధ్యాయులు ఆందోళనకు దిగారు. భారీగా స్కూల్ ఫీజులు వసూలు చేసిన యాజమాన్యం తమకు మాత్రం నాలుగు నెలలుగా జీతాలు ఇవ్వడం లేదని మండిపడుతున్నారు. క్లాసులు బహిష్కరించిన వీరు పాఠశాల ముందు బైఠాయించారు. ఇది తెలిసిన తల్లిదండ్రులు విద్యా సంవత్సరం మధ్యలో ఉండగా ఇటువంటి సమస్యలు వస్తే తమ పిల్లల భవిష్యత్ ఏం కావాలని ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లా ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని సమస్య పరిష్కరించాలని కోరారు.