: మిలిటెంట్ల కాల్పుల్లో గాయపడ్డ బాలుడు మృతి


కాశ్మీర్ లోని సోపూర్ లో నిన్న మిలిటెంట్ల కాల్పుల్లో గాయపడ్డ మూడేళ్ల బాలుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు ఉదయం మృతి చెందాడు. ఈ విషయాన్ని పోలీసులు ధ్రువీకరించారు. కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డ బుర్హాన్ ను వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే, బాలుడికి గాయాలు తీవ్రం కావడంతో వైద్య చికిత్స చేసినా కోలుకోలేకపోయాడని వైద్యులు తెలిపారు. శుక్రవారం రాత్రి తన కొడుకు బుర్హాన్ తో ఆడుకుంటున్న మాజీ మిలిటెంట్ భట్ పై హిజ్బుల్ ముజాహిద్ నులు లేదా లష్కరే- ఏ-తోయిబాకు చెందిన టెర్రరిస్టులు ఒక హ్యాండ్ గ్రెనేడ్ ను విసిరారు. అది గురి తప్పడంతో వెంటనే ఆటోమెటిక్ గన్ లతో తండ్రీకొడుకులను కాల్చిపారేశారు. భట్ ను ఆసుపత్రికి తరలిస్తుండగా అదేరోజు అతను మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.

  • Loading...

More Telugu News