: వైసీపీలోకి నన్ను రమ్మనడిగే దమ్ము, ధైర్యం ఎవరికీ లేవు!: కరణం బలరాం


వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి తనను రమ్మని అడిగే దమ్ము, ధైర్యం ఎవరికీ లేవని టీడీపీ సీనియర్ నేత కరణం బలరాం అన్నారు. అసలు ఆ పార్టీలో చేరాల్సిన అవసరం, అగత్యం కూడా తనకు లేవని స్పష్టం చేశారు. బలరాం వైసీపీలో చేరుతున్నట్టు వస్తున్న వార్తలపై ఆయన ఈ విధంగా స్పందించారు. ఆ వార్తలు అవాస్తవమని తేల్చి చెప్పారు. తనపై మీడియాలో వచ్చిన వార్తలు బాధించాయని, సీఎం చంద్రబాబుతో తనకు మంచి సంబంధాలు ఉన్నాయని చెప్పారు. తాను పదవుల కోసం రాజకీయాల్లోకి రాలేదని బలరాం అన్నారు. అంతేగాక తానొక కులానికో, వర్గానికో ప్రతినిధిని కానని, తానొక ప్రజాప్రతినిధినని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News